టాలీవుడ్: నందమూరి వారసుడిగా వచ్చిన కళ్యాణ్ రామ్ అడపా దడపా సినిమాలు తీస్తూ వస్తున్నాడు కానీ ఆశించిన ఫలితం ఐతే రావట్లేదు. కళ్యాణ్ రామ్ చేసే సినిమాలు కూడా మరీ తీసి పారేసేలా కూడా ఉండవు. కళ్యాణ్ రామ్ హీరోగా నిలదొక్కుకోవడానికి కూడా బాగానే కష్టపడతాడు అని ఇండస్ట్రీ లో టాక్ ఉంది. కళ్యాణ్ రామ్ హీరోగా ‘అతనొక్కడే’, ‘కత్తి’, ‘పటాస్’ లాంటి విజయాలు కూడా పొందాడు. మిగతా సినిమాలన్ని ప్లాప్ లుగానే నిలిచాయి. చివరగా ‘ఎంత మంచి వాడవురా’ అనే ఒక సినిమా తీసాడు కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేయబోతున్న ఒక సినిమా ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా టైం ట్రావెల్ పైన ఉండబోతుందని హింట్ ఇచ్చారు. తెలుగులో టైం ట్రావెల్ బేస్ చేసుకుని సూపర్ హిట్ అయిన ఏకైక సినిమా ‘ఆదిత్య 369 ‘ అది కూడా నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా 20 సంవత్సరాల క్రితం రూపొందింది. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 28 న ఈ సినిమా టైటిల్ ప్రకటించబోతున్నట్టు కూడా తెలిపారు. ఈ సినిమాని వశిష్ట్ అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ లో కూడా ఒక పుస్తకం, ఒక ఖడ్గం, గర్జిస్తున్న సింహం ఉన్న ఒక జెండా, బ్యాక్ గ్రౌండ్ లో యుద్దానికి సంబందించిన సీన్స్ తో పోస్టర్ ఆసక్తి కలిగించేలా ఉంది. చేదు నుండి మంచి కి టైం ట్రావెల్ అని టాగ్ జత చేసి పోస్టర్ వదిలారు.