మనం తెర మీద చూసే ప్రతీ ఫ్రేమ్ అందంగా అద్భుతంగా కనిపించడానికి తెర వెనక సినిమాకు సంబందించిన 24 క్రాఫ్ట్స్ కష్టపడతాయి. కొన్ని కొన్ని సార్లు మనకి తెర పైన చాల సింపుల్ గా ఇంతేగా అనిపిస్తుంది కానీ దాని వెనక కష్టం అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. అందులో ఒక క్రాఫ్ట్ సినిమాటోగ్రఫీ. డైరెక్టర్ విజన్ ని మన కళ్ళకి చూపించేది తన కెమెరా తోనే, మనం చూసే ప్రతి సీన్ ముందుగా చూసే కన్ను సినిమాటోగ్రాఫర్ దే.ఆ కన్ను చూపించే అద్భుతాల వెనక అద్వితీయమైన కృషి ఉంది. సినిమాల్ని కొంచెం టెక్నికల్ అంశాల కోసం చూసేవాళ్ళు , సినిమా ప్లాప్ అయినా కూడా ప్రత్యేకంగా సినిమాటోగ్రఫీ కోసం చూసే సినిమాలు చాలానే ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ ఎఫ్ర్ట్స్ ని చూపించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండింగ్ అవుతుంది. కొన్ని కొన్ని షాట్స్ కోసం వాళ్ళు జిమ్నాస్టిక్స్ ఏ చేయడం జరుగుతుంది.
ఈ వీడియో చూసిన తర్వాత మనం చూసే వీడియోల వెనకాల ఇంతా కష్టం ఉంటుందా అని మాత్రం అనిపిస్తుంది. ఒక్క సినిమాటోగ్రఫీ నే కాదు 24 క్రాఫ్ట్స్ లో ప్రతీ క్రాఫ్ట్ లో కష్టం ఉంటుంది. అందరూ కలిసి కష్టపడితేనే మనం క్వాలిటీ అవుట్ పుట్ చూడగలుగుతున్నాం.