టాలీవుడ్: ‘ది డెమోక్రటిక్ వయొలెన్స్’ అనే టాగ్ లైన్ తో రూపొందిన సినిమా ‘అర్ద శతాబ్దం’. ‘ఈ యాభై ఏళ్ల స్వాతంత్య్రం దేని కోసమో ఎవరి కోసమో ఇప్పటి దాకా అర్థం కాలేదు’ లాంటి డైలాగ్ తో ఇదివరకు విడుదలైన టీజర్ ఈ సినిమా పైన ఆసక్తి క్రియేట్ చేసింది. ఏప్రిల్ లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఈ నెలలో విడుదల అవుతుంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు.
‘ఈ విశాల సృష్టిలో మనిషి కన్నా ముందు ఎన్నో జీవరాశులుండేవి. ఒకానొక రాక్షస గడియలో మానవ జాతి పుట్టుక సంభవించింది’ అంటూ టీజర్ మాదిరిగానే శుభలేఖ సుధాకర్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభం అయింది. ఒక చిన్న ప్రేమ కథ దాని చుట్టూ కులానికి సంబందించిన ఘర్షణ, గొడవల నేపథ్యం లో సినిమా రూపొందినట్టు ట్రైలర్ లో చూపించారు. వీటి మధ్యలో నక్సలైట్లకు సంబందించిన విప్లవం తాలూకు పాయింట్స్ కొన్ని జత చేసారు. మరి ఈ ప్రేమకి, ఈ ఘర్షణలకు, నక్సలైట్ల విప్లవానికి గల సంబంధం ఏంటి అనేది సినిమా చూస్తే అర్ధం అవుతుంది.
ఒక పువ్వు కోసం కొట్టుకుచస్తున్నారంటే ఇంతటి గొడవల్లో ఆశ్చర్యం ఏముంది అని డైలాగ్ చెప్పి ‘ఈ యాభై ఏళ్ల స్వాతంత్య్రం దేని కోసమో ఎవరి కోసమో ఇప్పటి దాకా అర్థం కాలేదు’ అనే డైలాగ్ తో ట్రైలర్ ముగించారు. గొడవలు, కొట్లాటలు కాకుండా వాటి వెనకాల ఒక మంచి కథ , కథనం ఉందేమో అని ఆశిద్దాం.
కేరాఫ్ కంచరపాలెం ద్వారా గుర్తింపు పొందిన కార్తీక్ రత్నం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మరో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నవీన్ చంద్ర నటిస్తున్నాడు. మరిన్ని పాత్రల్లో అజయ్, శుభలేఖ సుధాకర్, టీఎన్ఆర్, సాయి కుమార్, ఆమని , రాజా రవీంద్ర నటించారు. వీర్ ధాత్మిక్ సమర్పణలో రిషిత శ్రీ క్రియేషన్స్ మరియు 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్ పతకాలపై చిట్టి కిరణ్ రామోజు , రాధాకృష్ణ.టి ఈ సినిమాని నిర్మించారు. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 11 న ఆహా ఓటీటీ లో విడుదల అవనుంది.