టాలీవుడ్: 16 భాషల్లో 40000 కి పైగా పాటలు పాడిన ఒక గాయకుడు, ఒక నటుడు, ఒక సంగీత దర్శకుడు, ఒక వ్యాఖ్యాత, 6 నేషనల్ అవార్డులు, 25 నంది అవార్డులు, 7 ఫిలిం ఫేర్, పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ – ఈ అవార్డులు, ఈ నెంబర్ లు ఆయన సాధించిన ఘనత అయితే ఇంతకు కోటి రేట్ల మంది హృదయాల్ని దోచింది ఆయన స్వరం. ఆయన ఎవరో కాదు కీర్తి శేషులు స్వర్గీయ శ్రీపతి పండితారాద్యుల బాల సుబ్రహ్మణ్యం – ఎస్పీబీ. పోయిన సంవత్సరం కరోనా తో పోరాడి ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆయన వెళ్లారు కానీ ఆ స్వరం ఇప్పటికీ ఈ భూమి మీద ఎదో ఒక చోటే ఎదో ఒక మూల వినపడుతూనే ఉంటుంది.
ఈ రోజు బాలు గారి 75 వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పుట్టిన రోజుని టాలీవుడ్ ఒక గ్రాండ్ ట్రిబ్యూట్ తో అయన గొప్పతనం తెలియచేసారు. ఇపుడున్న పరిస్థితుల ప్రకారం వేడుకలు జరుపలేకపోతున్నారు కాబట్టి దాదాపు పన్నెండు గంటల నాన్-స్టాప్ లైవ్ వీడియో ఒకటి ఈరోజు ఉదయ 10 గంటల నుండి రాత్రి 10 గంటల వారికి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ నటుడు సాయికుమార్ ప్రారంభిస్తూ
‘ తెలుగు వాళ్ళు మరచిపోలేనివి
నన్నయ్య ఖడ్గం
అన్నయ్య ఖంఠం’
అని బాలు గారి గొప్పతనం చెప్తూ మొదలుపెట్టారు.
ఈ కార్యక్రమం లో మొదట చిరు గారి బాలు గారి ని స్మరిస్తూ తన జ్ఞాపకాలని షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా చాలా మంది నటులు, సంగీత దర్శకులు, నేపధ్య గాయకులు బాలు గారితో తమ అనుభవాల్ని షేర్ చేస్తూ బాలు గారి 75 వ జయంతి కి ఒక మంచి ట్రిబ్యూట్ ని ఇచ్చారు.