న్యూఢిల్లీ: గత నెలరోజులకు పైగా భారత్ ను వణికించిన కరోనా ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు క్రమంగా రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 1,20,529 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపింది.
ఈ తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసులు సంఖ్య 2,86,94,879కి చేరుకుంది. అలాగే 24 గంటల్లో 3,380 మంది కరోనాతో పోరాడి మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,44,082కి చేరుకుంది.
కొత్త కేసులకంటే ఎక్కువగా గత 24 గంటల్లో 1,97,894 మంది కోవిడ్ పేషెంట్లు కోలుకుని దేశంలోని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,67,95,549 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ప్రస్తుతం 15,55,248 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 22,78,60,317 మందికి వ్యాక్సినేషన్ అందించారు.