టాలీవుడ్: వెళ్ళిపోమాకే సినిమాతో క్లాస్ హీరో గా పరిచయం అయ్యి, ఈ నగరానికి ఏమైంది లాంటి యూత్ ఫుల్ సినిమాతో ఇండస్ట్రీ లో పేరు తెచ్చుకున్న నటుడు విశ్వక్సేన్. ఈ హీరోని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా, ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచిన సినిమా ఏది అంటే విశ్వక్ స్వయంగా నిర్మించి డైరెక్ట్ చేసిన ‘ఫలక్ నుమా దాస్’. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా విశ్వక్ చాలా దూకుడుగా చేసి సినిమాని హిట్ బాటలో నిలబెట్టాడు. తర్వాత ‘HIT ‘ అనే ఇన్వెస్టిగేషన్ సినిమాలో నాచురల్ స్టార్ నాని నిర్మాణంలో హీరోగా నటించాడు. ప్రస్తుతం ‘పాగల్’ అనే రొమాంటిక్ జానర్ సినిమాలో నటిస్తున్నాడు.
అయితే ఈ రోజు విశ్వక్ ఒక ఫలక్ నుమా దాస్ సినిమాకి సంబందించిన ఒక పాత పిక్ షేర్ చేసాడు.’ ఫలక్ నుమా దాస్ సినిమా షూటింగ్ మొదలు పెట్టి ఈరోజు మూడు సంవత్సరాలు ఐతుందని , నిన్ననే మొదలు పెట్టినట్టుందని , ఈ సినిమా టీం మొత్తం మళ్ళీ కలుస్తాం – ఫలక్ నుమా దాస్ 2 ‘ అని ఒక టాగ్ జత చేసి పోస్ట్ చేసారు. దీంతో ఈ సినిమాకి కొనసాగింపు మొదలుపెట్టబోతున్నట్టు డైరెక్ట్ గానే ప్రకటించాడు. ఫలక్ నుమా దాస్ సినిమాని మళయాళం లో సూపర్ హిట్ అయినా ‘అంగమలై డైరీస్’ అనే సినిమాకి రీమేక్ గా రూపొందించారు. ఆ సినిమాకి సీక్వెల్ రాలేదు కానీ ఈ సినిమాకి రీమేక్ మొదలుపెట్టనున్నట్టు ప్రకటించారు.