టాలీవుడ్: చిన్న నటుడిగా తన సినీ ప్రయాణం ప్రారంభించి ఇపుడు హీరోగా సినిమాలు చేస్తూ ప్రతీ సినిమాకి కొత్తదనం చూపిస్తూ తన నుండి సినిమా వస్తుందంటే ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది అని సినీ అభిమానులు చెప్పుకునేంత రేంజ్ కి చేరుకున్నాడు శ్రీ విష్ణు. గత రెండు మూడు సినిమాలు అంతగా ఆడనప్పటికీ చేతిలో పలు సినిమాలతో బిజీ గా ఉన్నాడు శ్రీ విష్ణు. తాను హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘రాజ రాజ చోర’. దాదాపు షూటింగ్ మొత్తం ముగించుకుని విడుదలకి సిద్ధం అవుతున్న ఈ సినిమాకి ప్రమోషన్స్ మొదలు పెడుతుంది ఈ సినిమా టీం.
కరోనా సెకండ్ వేవ్ తగ్గు ముఖం పడుతుండడం తో తొందర్లో థియేటర్లు తెరచుకునే అవకాశాలు ఉండడంతో థియేటర్ లు తెరచుకోగానే ముందు విడుదల చేసే సినిమాల్లో తమ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుంది ‘రాజ రాజ చోర’ టీం. ఈ రోజు శ్రీ విష్ణు ఒక వీడియో విడుదల చేసారు. సోషల్ మీడియా లో గంగవ్వ సినిమా ప్రొమోషన్ చేసే విషయం తెలిసిందే. ఈ వీడియో లో శ్రీ విష్ణు గంగవ్వ మన సినిమా గురించి తెలుసు కదా ఎపుడు ప్రొమోషన్ మొదలు పెడ్తవు అవ్వ అని అడగగా జూన్ 11 న ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేట్లు ఒక వీడియో తయారు చేసి విడుదల చేస్తా అని చెప్పడం చూస్తాం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హసిత్ గోలి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.