fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsనయనతార 'నేత్రికాన్' ఫస్ట్ సాంగ్ రిలీజ్

నయనతార ‘నేత్రికాన్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్

Nayanathaara Netrikaan FirstSongRelease

కోలీవుడ్: కమర్షియల్ హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో కొనసాగుతూనే లేడీ ఓరియెంటెడ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కి కేరాఫ్ గా నిలిచింది నయనతార. ప్రస్తుతం నయనతార నటిస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘నేత్రికాన్’. ఈ సినిమాలో నయనతార ఒక అంధురాలి పాత్రలో నటిస్తుంది. కేవలం అంధురాలిగా కాకుండా ఒక క్రైమ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండడం ఈ సినిమా విశేషం. ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్ ఈ సినిమా పైన అంచనాలు పెంచింది. ఒక అంధురాలి పాత్ర ఒక క్రైం కేసు ఎలా ఇన్వెస్టిగేట్ చేసింది అనే ఇంటరెస్ట్ ని కలుగచేసింది ఈ సినిమా టీజర్.

ఈ రోజు ఈ సినిమా నుండి మొదటి పాట విడుదల చేసింది సినిమా టీం. ఈ పాట లిరిక్స్ కూడా ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా ఉన్నాయి. ఈ లిరికల్ వీడియో లో నయనతారతో పాటు ప్రస్తుతం కఠిన సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా తమ విధులు నిర్వహిస్తున్న డాక్టర్స్, హెల్త్ కేర్, పోలీస్, మున్సిపాలిటీ, డెలివరీ స్టాఫ్ ని ఉద్దేశించి వీడియో లో చూపించారు. విగ్నేష్ శివన్ ఈ పాటకి సాహిత్యం అందించగా గిరీష్ గోపాల కృష్ణన్ సంగీతం అందించారు. సిద్ శ్రీరామ్ వాయిస్ తో ఈ పాట రీచ్ కూడా పెరిగిపోయింది. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై విగ్నేష్ శివన్ నిర్మాణంలో మిలింద్ రావు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular