టాలీవుడ్: కరోనా తర్వాత విడుదలై సూపర్ హిట్ సాధించిన మొదటి సినిమా ‘క్రాక్’. రవి తేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వాళ్ళిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత గోపీచంద్ నట సింహం బాలకృష్ణ ని డైరెక్ట్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి కానీ అధికారిక ప్రకటన ఐతే ఏదీ రాలేదు. ఈ రోజు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన విడుదల చేసారు.
బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న ‘అఖండ’ సినిమా అయిపోయిన తర్వాత గోపీచంద్ మలినేని తో పని చేయనున్నాడు. అందరు పెద్ద స్టార్ లతో వరుసగా సినిమాలు ప్రకటిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనున్నారు. నందమూరి బాలకృష్ణ 107 వ సినిమాగా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా ప్రకటనతో పాటు సింహం తో ఒక ఫోటో విడుదల చేసారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనున్నారు. ఐతే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తనకి రెండు బ్లాక్ బస్టర్ లు అందించిన బోయపాటి శ్రీనివాస్ తో హ్యాట్రిక్ కాంబినేషన్ లో ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నాడు.