టాలీవుడ్: చిన్న నటుడిగా పరిచయం అయ్యి హీరోగా ఎదిగి ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న నటుడు శ్రీ విష్ణు. ప్రతీ సినిమాకి కొత్తదనం చూపిస్తూ, కొత్త కొత్త పాత్రల్లో నటిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ప్రస్తతం శ్రీవిష్ణు హీరోగా ‘రాజ రాజ చోర’ అనే సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఈ రోజు నుండి మొదలుపెట్టారు. ఈ సినిమా థీమ్ గురించి తెలియ చేసే ఒక వీడియో ఈ రోజు విడుదల చేసారు. ఈ వీడియో సోషల్ మీడియా ఫేమ్ గంగవ్వ వాయిస్ ఓవర్ తో రూపొందించారు.
ఒక ఇంట్లో ఒక పెద్దావిడ తన మనవరాలికి ఈ కథ చెపుతున్నట్టు ఈ కథని చెప్పారు. సూర్యుడు భూమిని ఏర్పరచి అందులో కోతిని మరియు బంగారాన్ని వదిలాడు. బంగారం కిరీటం అయ్యి రాజు పాత్ర పోషిస్తుండగా, కోతి దొంగగా మారి దోచుకుంటుంది. కిరీటం ఆశించిన దొంగ (చోరుడు) రాజు దగ్గరి నుండి కిరీటాన్ని దోచుకుంటాడు. కిరీటం లేని రాజుని దొంగ అనుకుంటారు జనాలు, కిరీటం ఉన్న దొంగని రాజు అనుకుంటారు. అలా రాజ రాజ చోర కథ మొదలైంది అన్నట్టు సినిమా థీమ్ ని పరిచయం చేసింది గంగవ్వ.
ఈ సినిమాలో శ్రీ విష్ణు కి తో పాటు మేఘా ఆకాష్, సునయన, రవి బాబు నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అవనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ ఈ నెల 18 న విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు.