న్యూ ఢిల్లీ: కేంద్రం మరోసారి ట్విటర్‌పై కొత్త ఐటీ నిబంధనలపై గురిపెట్టింది. ఈ నిబంధనలపై వివరణ ఇచ్చేందుకు ట్విటర్‌ను జూన్ 18వ తేదీన హాజరుకావాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నోటీసులు పంపింది. కొత్త ఐటీ నిబంధనలు పాటించనందున ట్విటర్‌పై కేంద్రం మరోసారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
అందుకు ఇటీవల ట్విట్టర్ కు తుది నోటీసులి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్ని సార్లు నోటిసులిచ్చినప్పటికీఈ తగిన వివరణ ఇచ్చే విషయంలో ట్విటర్ కంపెనీ విఫలమైందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటీవై) లోని సైబర్ లా గ్రూప్ కోఆర్డినేటర్ రాకేశ్ మహేశ్వరి ట్విటర్ కు రాసిన లేఖలో తెలిపారు.
సోషల్ మీడియా, ఆన్లైన్ వార్తలను దుర్వినియోగం జరుగుతున్న విషయంపై కమిటీ ట్విట్టర్ కు తాజాగా నోటీసులిచ్చింది. జూన్ 18వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పార్లమెంటు కాంప్లెక్స్‌లోని ప్యానెల్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు, ఫేక్‌న్యూస్ నివారణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.