అమరావతి: ఏపీలో గత కొన్ని నెలలుగా టెన్షన్ లో ఉన్న విషయం పదవ తరగతి పరీక్షలు. ఈ టెన్త్ పరీక్షలపై రేపు ఏపీ సీఎం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ తరఫున ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని అన్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే నెల అనగా జులై 26వ తేదీ నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించడానికి తాము ప్రతిపాదనలు చేన్నట్లు తెలిపారు. కాగా పదవ తరగతి పరీక్షలకు 6.28 లక్షల మంది విద్యార్ధుల హాజరవనున్నారని, వారి కోసం 4 వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ పరీక్షలను సజావుగా నిర్వహించడానికి 80 వేల మంది ఉపాద్యాయులు మరియు ఇతర సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో ఈ సారి 11 పేపర్లు కాకుండా ఏడు పేపర్లకే పరీక్షలు నిర్వహించేలా సూచిస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు పరిక్షా ఫలితాలను సెప్డెంబర్ 2 లోపు విడుదల చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
క్రిత సంవత్సరం కరోనా ఉదృతి కారణంగా పదవ తరగతి పరీక్షలను రద్దు చేయగా, ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్ధులకి తీవ్ర నష్టం కలుగుతుందని అదే క్రమంలో కోవిడ్ నిబంధనలు అనుసరించి పరీక్షలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు.