టాలీవుడ్: కరోనా ప్రారంభం అయినప్పటినుండి ఓటీటీ రంగం లో చాలా మార్పులు వచ్చాయి. జనాలకి కొత్త కంటెంట్ కి ఉన్న ఏకైన మార్గం ఓటీటీ అవడం తో ఈ రంగం లో అవకాశాలు మరియు కొత్త ఓటీటీలు మొదలయ్యాయి. అప్పుడప్పుడే మొదలైన తెలుగు ఓటీటీ ‘ఆహా‘ ఈ టైం లో పుంజుకుంది. సంవత్సర కాలం గా చాలా తెలుగు చిన్న సినిమాలని , సూపర్ హిట్ అయిన పర బాషా సినిమాలని డబ్ చేస్తూ మంచి యూసర్ బేస్ తో కంటెంట్ ని పెంచుతూ దూసుకెళ్తుంది. ఇదివరకే ఉన్న నేషనల్ టెలివిజన్ నెట్వర్క్స్ స్టార్ట్ నెట్వర్క్ వారి హాట్ స్టార్, సన్ టెలివిజన్ వారి సన్ నెక్స్ట్, జీ టెలివిజన్ వారి ZEE5 ఓటీటీ లు తెలుగులో ఆకట్టుకునేందుకు బాగానే ప్రయత్నించాయి కానీ కంటెంట్ పెంచుకోవడం లో విఫలం అవడం తో ఈ ఓటీటీ ల్లో పెద్ద మార్పు ఏమీ లేదు.
ప్రస్తుతం మరో నేషనల్ టెలివిజన్ సంస్థ తెలుగు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతుంది. సోని నెట్వర్క్ కి సంబందించిన సోనీ liv ఓటీటీ హిందీ కంటెంట్ తో నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులని ఉపయోగించుకుని తెలుగు లో కూడా ఈ ఓటీటీ మొదలు పెట్టనుంది. దీని హెడ్ గా మధుర మ్యూజిక్ హెడ్ అయిన మధుర శ్రీధర్ ని నియమించారు. ఇప్పటికే ఈ సోనీ liv లో హిందీ లో చాలా సినిమాలు, చాలా వెబ్ సిరీస్ ల రూపం లో కంటెంట్ ఉంది చూస్తుంటే ఆహా ని ఫాలో అయ్యి చాలా వెబ్ సిరీస్ లని డబ్ చేసి ఈ కొత్త ఓటీటీ లో పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.