fbpx
Friday, November 1, 2024
HomeBusiness14 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయిన గౌతమ్‌ అదాని

14 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయిన గౌతమ్‌ అదాని

ADANI-LOSE-SECOND-RICHEST-ASIAN-POSITION

ముంబై: ఆసియా ధనవంతుల జాబితాలో మొదటి స్థానం ముఖేష్ అంబానిదైతే, కొద్ది రోజుల క్రితం వరకు రెండో ధనవంతుడి స్థానం దక్కించుకున్న గౌతమ్‌ అదానీ తాజాగా తన స్థానాన్ని కోల్పోయారు. అదానీ గ్రూపుకు సంబంధించిన 3 కంపెనీలకు చెందిన బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్‌ కావడంతో ఒక్కసారిగా ఆయన సంపద ఆవిరయింది.

దాని వల్ల గౌతం అదానీని వెనక్కు నెట్టేసి చైనాకు చెందిన కుబేరుడు జాంగ్‌ షాన్‌షాన్‌ రెండో స్థానాని ఎగబాకారు. ప్రపంచంలోని బిలియనీర్ల సంపదను అంచనా వేసే గ్లోబల్‌ ఇండెక్స్‌ తాజా జాబితాలో అదానికి షాక్‌ తగిలింది. ఆసియాలోనే అత్యంత ధనవంతులైన బిలియనీర్ల జాబితాలో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ప్రథమ స్థానంలో ఉండగా అనతి కాలంలోనే అదాని రెండో స్థానానికి చేరుకున్నారు.

అదానీ గ్రూపు తమ పోర్టు వ్యాపారా‌లలో చూపిన దూకుడుతో ఆ కంపెనీ షేర్లు తక్కువ కాలంలో అనూహ్యంగా పెరిగాయి. అదాని గ్రూపులన్నీ కలిసి అతి తక్కువ కాలంలో వంద బిలియన్ల డాలర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మార్క్‌ని దాటాయి. అదానీ ప్రభ వెలిగిపోతున్న​ సమయంలో నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డీపీ) ఇచ్చిన షాక్‌తో అదానీ స్పీడ్‌కి బ్రేకులు పడ్డాయి.

క్రితం వారం సోమవారం అదానీ గ్రూపుకి సంబంధించిన 3 కంపెనీలకు చెందిన బ్యాంకు అకౌంట్లను నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డీపీ) సీజ్‌ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆయన సంపద 77 బిలియన్‌ డాలర్ల నుంచి 63 బిలియన్‌ డాలర‍్లకు పడిపోయింది. ఒక్క రోజు వ్యవధిలోనే 14 బిలియన్ల డాలర్ల సంపద ఆవిరైపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular