టాలీవుడ్: కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా డాక్టర్స్ వైరస్ కి డైరెక్ట్ గా ఎక్సపోజ్ అయ్యి కష్ట సమయాల్లో ఎన్నో సేవలు అందించారు. ఇందులో భాగంగా ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది తమ సొంత లైఫ్ ని స్ట్రెస్ఫుల్ గా లీడ్ చేసారు. కొందరు డాక్టర్లు రోజుకి 15 గంటలు పని చేసారు. కొందరు డాక్టర్లు ఇలాంటి సమయంలో ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అని హాస్పిటల్ లోనే నెల రోజుల వరకు గడిపారు. వీళ్లందరికోసం నాని ఒక స్పెషల్ చేయబోతున్నాం అని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ‘దారే లేదా’ అంటూ ఒక స్పెషల్ సాంగ్ డాక్టర్స్ కోసం తయారు చేసి రేపు విడుదల చేయనున్నారు.
ఈ రోజు ఆ వీడియో కి సంబందించిన చిన్న గ్లిమ్స్ విడుదల చేసారు. ఈ వీడియో లో సత్యదేవ్ మరియు ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా ద్వారా పరిచయం అయిన ‘రూప కొడువాయుర్’ నటించారు. ఈ వీడియో ని బట్టి చూస్తే పెళ్లి ఐన యువ జంట లాగ కనిపిస్తున్నట్టు అర్ధం అవుతుంది. కరోనా సమయం లో హాస్పిటల్ లో ఉండే డాక్టర్ గా సత్యదేవ్ కనిపించారు. రేపు ఈ పాట ఫుల్ వీడియో ని విడుదల చేస్తున్నారు. కృష్ణ కాంత్ సాహిత్యం అందించగా విజయ్ బుల్గానిన్ సంగీతం లో ఈ పాట రూపొందింది. ఈ పాటని చాయ్ బిస్కెట్ వారి సహకారంతో నాని ప్రొడక్షన్ హౌస్ ‘వాల్ పోస్టర్ సినిమా’ వాళ్ళు రూపొందించారు.