అమరావతి : ఏపీలో 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను ఇవాళ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. 2021-22 ఏడాదిలో ఒకే సారి 10,143 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం అని తెలిపారు.
ఈ ఉద్యోగాల నియామకం చాలా పారదర్శకంగా జరుపుతామని అన్నారు. అవినీతికి వివక్షకు ఏ మాత్రం తావులేకుండా పూర్తి మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం 4 నెలల్లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఒక రిక్రూట్మెంట్ లో ఒక లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదన్నారు.
రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా 2.50లక్షలకు పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించామన్నారు. ఏపీలో ఇప్పటివరకు 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశాం. దళారీ వ్యవస్థ లేకుండా ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. మినిమమ్ టైం స్కేల్‌తో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచాం అన్నారు.