టాలీవుడ్: కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా డాక్టర్స్, పోలీస్, శానిటైజెషన్ వర్కర్స్, మున్సిపాలిటీ స్టాఫ్, హాస్పిటల్ స్టాఫ్ ఇలా ఎంతో మంది తమ ప్రాణాల్ని పనంగా పెట్టి సేవలు అందించారు. అందులో డాక్టర్స్ డైరెక్ట్ గా వైరస్ కి ఎక్స్ పోజ్ అయ్యి తమ సేవలు అందించారు. అంత చేసినా కూడా కొన్ని చోట్ల వైద్యులపై దాడులు జరిగాయి. ఇలాంటి అంశాలని ప్రస్తావిస్తూ నాచురల్ స్టార్ నాని ‘దారే లేదా‘ అంటూ ఒక వీడియో ని రూపొందించి విడుదల చేసారు.
కొత్తగా పెళ్ళైన ఒక డాక్టర్ జంట కరోనా సమయంలో తమ డైలీ రొటీన్ ఎలా ఉందో చూపిస్తూ బయట జరుగుతున్న సంఘటనలకు రిలేట్ చేస్తూ డాక్టర్స్ చేసిన కృషిని కళ్ళకి కట్టినట్టు చూపించారు. పెళ్ళైన ఇద్దరు డాక్టర్స్ ఒకరు మార్నింగ్ షిఫ్ట్, ఒకరు నైట్ షిఫ్ట్ చేస్తూ, ఆన్లైన్ లో కన్సల్టేషన్ ఇస్తూ కరోనా సమయంలో తమ వంతుగా సేవలు అందించడం ఈ వీడియో లో చూపించారు. చివరికి మొదటి పెళ్లి రోజుకు అయినా కలిసి జరుపుకుందాం అనుకున్నప్పుడు భర్త కి కరోనా రావడం, ఆ టైం లో కూడా భార్య ని హాస్పిటల్ లో సేవలు అందించమని పంపించడం వీడియో కి మంచి ఎమోషనల్ టచింగ్ ఇచ్చారు.
ఈ పాటలో లిరిక్స్ కూడా బాగా కుదిరాయి. తమ అనుభవాన్ని, తమ చదువుని, తమ సేవాగుణాన్ని కూడా లెక్క చేయకుండా డాక్టర్స్ పై దాడి చేయడాన్ని ఎమోషనల్ వే లో చూపించి ఆకట్టుకున్నారు.అంతే కాకుండా ఈ వీడియో ని కేవలం పాట కోసం రూపొందించినట్టు కాకుండా వీడియో లో 2 ఫ్రేమ్స్ చూపించి ఒక వైపు రియల్ ఇన్సిడెంట్స్ మరొక వైపు కథ తాలూకు సీన్స్ ని చూపించి రిలేట్ చేసారు. చివర్లో నాని వచ్చి మన వంతుగా మనం మాస్క్ దరిద్దాం అన్నట్టు సందేశం ఇచ్చి వీడియో ముగించారు. డాక్టర్స్ కోసం రూపొందించిన ఈ ప్రత్యేక వీడియో అందరిని ఆకట్టుకుంటుంది అనడం లో సందేహం లేదు.