టాలీవుడ్: తమిళ నటుడి స్థాయి నుండి నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన నటుడు ధనుష్. తెలుగు లో సెన్సిబుల్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుని వరుస హిట్లు రూపొందిస్తున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల. వీళ్లిద్దరు కలిసి మొదటి సారి పని చేయనున్నారు. ఇది ఎవ్వరూ ఊహించి కూడా ఉండని కాంబినేషన్ అనడం లో సందేహం లేదు. కానీ అనుకోకుండా ఇవాళ ఈ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన చేసి ఆశ్చర్య పరచారు. అంతే కాకుండా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందించనున్నారు. ఈ సినిమాని ప్రస్తుతం శేఖర్ కమ్ములతో కలిసి ‘లవ్ స్టోరీ’ సినిమాని నిర్మించిన ఏషియన్ మూవీస్ వారు నిర్మించనున్నారు.
మామూలుగా శేఖర్ కమ్ముల సినిమాల్లో మధ్య తరగతి జీవితాలు, అమ్మాయిలకి ప్రాముఖ్యత ఉండే విషయాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇన్ని రోజులు రీజనల్ సినిమాల వారికి ఆ కంటెంట్ సరిపోతుంది. మరి ధనూష్ కి తగ్గట్టు అలాగే పాన్ ఇండియా రేంజ్ కాబట్టి ఆ రేంజ్ కంటెంట్ కోసం శేఖర్ కమ్ముల ఎలాంటి స్టోరీ ఎంచుకుంటాడో చూడాలి. మామూలుగా శేఖర్ కమ్ముల ఒక సినిమా ముగిసి కొంత కాలం అయ్యే వరకు తన తదుపరి సినిమా గురించి ఎలాంటి ప్రకటన చెయ్యరు. కానీ ప్రస్తుతం తాను డైరెక్షన్ చేసిన ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదల అవకుండానే ఈ సినిమా ప్రకటించి ఆశ్చర్య పరచారు. అంతే కాకుండా ధనూష్ లైన్ అప్ కూడా మరో రెండు-మూడు సంవత్సరాలు ఖాళి లేకపోవడం తో మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.