మాలీవుడ్: ది కంప్లీట్ ఆక్టర్ / పరిపూర్ణ నటుడు అన్న పేరున్న హీరో మోహన్ లాల్. తెలుగులో నటించిన ‘జనతా గారేజ్’, ‘మనమంతా’ సినిమాల ద్వారా ఈ జెనెరేషన్ వాళ్ళకి కూడా మోహన్ లాల్ అంటే ఎవరో తెలిసింది. మోహన్ లాల్ హీరోగా ప్రముఖ దర్శకుడు ప్రియదర్శి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మరక్కార్’. ఈ రోజు ఈ సినిమా విడుదల తేదీ ని ప్రకటించారు.
ఒక యుద్ధం నేపథ్యం లో రూపొందించిన ఈ సినిమాకి ఏకంగా గా మూడు జాతీయ అవార్డులు లభించాయి. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ , ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు ఉత్తమ కాస్ట్యూమ్ కాటగిరీల్లో ఈ సినిమాకి నేషనల్ అవార్డు లభించాయి. 2019 లోనే సెన్సార్ కంప్లీట్ చేసిన ఈ సినిమా విడుదల కంటే ముందే నేషనల్ అవార్డు జ్యూరీ కి పంపడం జరిగింది. సినిమా విడుదలకి ముందే అవార్డులు గెలుచుకోవడం అంటే ఇదే మొదటిసారెమో.
ఈ సినిమాలో మోహన్ లాల్ తో పాటు కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శి, మంజు వారియర్, అర్జున్ సర్జా, సునీల్ శెట్టి, కీలక పాత్రల్లో నటించారు. మలయాళం ఇండస్ట్రీ కి సంబంధించి ఈ సినిమా హై బడ్జెట్ లో నే రూపొందింది. ఆగష్టు 12న ఓనమ్ పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్టు ఈరోజు మేకర్స్ ప్రకటించారు.