అమరావతి: ఆంధ్రప్రదేశ్ 2008 డీఎస్సీ రాసి ఉద్యోగాళ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆ డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం నూతనంగా ఉద్యోగాలు కల్పించింది. 2,193 మంది డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులను రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులను ఇచ్చింది.
వారందరికీ ఎస్జీటీ టీచర్లుగా మినిమమ్ టైమ్ స్కేల్ ను వర్తింపజేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది. అయితే 13 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపుల తరువాత 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగినట్లయింది. వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తున్నామని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
ఏపీ సీఎం మానవతా దృక్పథంతో 2008 డీఎస్సీ అభ్యర్ధుల సమస్యను పరిష్కరించామని అన్నారు. ‘డీఎస్సీ-2008’ సమస్య గత 13 ఏళ్లుగా పెండింగ్లో కొనసాగిందని అన్నారు. అభ్యర్థుల భవితవ్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో వ్యవహరించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.