fbpx
Friday, December 27, 2024
HomeTelanganaతెలంగాణలో పాఠశాలల పున:ప్రారంభంపై హైకోర్టులో విచారణ

తెలంగాణలో పాఠశాలల పున:ప్రారంభంపై హైకోర్టులో విచారణ

HIGHCOURT-ENQUIRES-SCHOOLS-REOPENING-IN-TELANGANA

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు జులై 1 నుంచి ప్రారంభం చేయడంపై హైకోర్టులో బుధవారం విచారణ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా హైకోర్టుకు వివరాలను సమర్పించారు. ఈ సందర్భంగా అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా, లేదా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

పాఠశాల ప్రారంభంపై రెండు మూడు రోజుల్లో పూర్తి విధి విధానాలను ఖరారు చేయనున్నట్లు సుల్తానియా కోర్టుకు తెలిపారు. అయితే ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని, సమాంతరంగా ఆన్‌లైన్‌ బోధన కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా విద్యాసంస్థలు తల్లిదండ్రుల అనుమతి తప్పక తీసుకోవాలని తెలిపారు.

కాగా ఇలా పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం చాలా కష్టమని హైకోర్టు అభిప్రాయం తెలిపింది. తెలంగాణ కోర్టు అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే తగు విధివిధానాలు ఖరారు చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. దీనిపై ఒక వారంలోగా పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular