టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటవారసులకి కొదవేలేదు. ఇపుడు మరో వారసుడు హీరో గా రానున్నాడు. అది కూడా ‘హీరో’ అనే టైటిల్ తో వస్తున్నాడు. అతను ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు కి మేనల్లుడు, తెలుగు దేశం పార్టీ ఎం.పి గల్లా జయదేవ్ కి కొడుకు గల్లా అశోక్. గల్లా అశోక్ హీరో గా నటిస్తున్న ‘హీరో’ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. ఈ టీజర్ ని మహేష్ బాబు విడుదల చేసారు. తన అల్లుడి మొదటి సినిమా టీజర్ తన చేతుల మీదుగా విడుదలయి చేయడం కన్నా ఆనందకరమైన విషయం ఏముంటుంది అని టీజర్ విడుదల చేసి తన మేనల్లుడికి బెస్ట్ విషెస్ తెలియచేసారు.
ఈ సినిమాని ‘దేవదాస్’, ‘శమంతకమణి’ లాంటి సినిమాలని రూపొందించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందించారు. టీజర్ ఆరంభ షాట్ లోనే అశోక్ టక్కరి దొంగ సినిమాలో మహేష్ లుక్ ని దించేసాడు. మరొక షాట్ లో హాలీవుడ్ జోకర్ సీన్ ని చూపించాడు. మధ్యలో చాలా సీన్స్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ తో రొమాన్స్, కామెడీ, ఫామిలీ ఎమోషన్స్ ఇలా చాలా అంశాలని టచ్ చేసినట్టు తెలుస్తుంది. టీజర్ ప్రకారం ఈ సినిమాలో అశోక్ పాత్ర సినిమాల్లో నటించే హీరో పాత్ర అయ్యి ఉంటుందని అనిపిస్తుంది. అందుకే టైటిల్ కూడా ‘హీరో’ అని పెట్టారేమో అని ఒక ఆలోచన.
టీజర్ లో వినిపించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి స్పెషల్ మెన్షన్ ఇవ్వచ్చు. ఈ సినిమాకి గిబ్రాన్ సంగీతం అదనపు ఆకర్షణ అవనుంది టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. టీజర్ లో కనిపించిన విజువల్స్ చూసాక సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ ఈ సినిమాకోసం అద్భుతమైన విజువల్స్ ఇచ్చారని అర్ధం అవుతుంది. అమర రాజా మీడియా మరియు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అశోక్ తల్లి పద్మావతి గల్లా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. టీజర్ వరకు అశోక్ స్క్రీన్ ప్రెజన్స్ , యాక్టింగ్ స్కిల్స్ ఒక డెబ్యూటేన్ట్ కి తగ్గట్టుగా బాగున్నాయి. సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది మామయ్యా కి తగ్గ వారసుడు అవుతాడా లేదా అని.