బార్సిలోనా: అమెరికన్ టెక్నాలజీ ఎంట్రెప్రెన్యూర్‌గా పేరుగాంచిన వ్యక్తి మెక్‌అఫీ. ప్రస్తుతం ప్రపంచంలో వాడుకలో ఉన్న యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ లలో టాప్ లో ఉన్న సంస్థ మెకఫీ. 80వ దశకంలోనే యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ మెకఫీని కనిపెట్టి అందరి దృష్టిని ఆకర్షించిన గొప్పవాడు మెకఫీ. కాగా టెన్నెస్సెలో పన్నుల ఎగవేత మరియు న్యూయార్క్‌లో క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి.
తనపై ఉన్న ఆరోపణల కేసులో అమెరికా నుంచి పారిపోయిన ఆయన్ని, గత ఏడాది అక్టోబర్‌లో స్పెయిన్ పోలీసులు అరెస్ట్ చేసి బార్సిలోనా జైలుకి తరలించారు. ఇక పన్నుల ఎగవేత ఆరోపణల కేసులో మెక్‌అఫీని అమెరికాకు అప్పగించే స్పెయిన్ కోర్టు బుధవారం నాడే కీలక తీర్పు వెలువరించింది. ఆయన్ని అమెరికాకు అప్పగించాలని స్పెయిన్ పోలీసులను ఆదేశించింది.
అయితే ఈ తీర్పు నచ్చకే మెకఫీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అందరూ భావిస్తున్నారు. కోర్టు కు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉన్నా, తాను జైల్లో మగ్గడానికి ఆయన మనసు అంగీకరించలేదు. సొసైటీ ఆయన మీద పగ పట్టింది’ అని ఆయన తరపు లాయర్ జవెయిర్ మీడియా ముందు భావోద్వేగంగా మాట్లాడారు.
2011లో తన కంపెనీని ఇంటెల్‌కు అమ్మేసిన మెక్‌అఫీ, వ్యాపారాలకు దూరంగా ఉంటూ విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ వచ్చాడు. 2012లో పొరుగింటి వ్యక్తి హత్య కేసులో పోలీసుల ఎంక్వైరీ నుంచి తప్పించుకునేందుకు పారిపోయాడు. తన సిద్ధాంతాలకు విరుద్ధంగా పన్నులు కట్టలేనని చెబుతూ, కొన్ని ఏళ్లపాటు ప్రభుత్వానికి ఆయన పన్నులు చెల్లించలేదు. ట్విటర్‌లో ఆయనకు ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఒక మేధావి జీవితం ఇలా విషాదంగా ముగియడంపై ఆయన అభిమానులు కలత చెందుతున్నారు.