బాలీవుడ్: బాలీవుడ్ లో నెపోటిజం మాఫియా హవా నడుస్తుంది. సూపర్ సక్సెస్ లో ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పూత్ అకాల మరణం తర్వాత కూడా ఈ మాఫియా బాలీవుడ్ ని వదిలిపెట్టట్లేదు. ప్రస్తుతం నెపోటిజం ఛాయలు లేని మరో బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ దాదాపు సుశాంత్ ఎదుర్కొన్న పరిస్థితులని ఎదుర్కొంటున్నాడు. కరణ్ జోహార్ రూపొందిస్తున్న ‘దోస్తానా 2 ‘ సినిమా నుండి తప్పుకున్న తర్వాత మరి కొన్ని సినిమాల నుండి కూడా కార్తీక్ కి నిరాశ ఎదురయింది. అయితే ఇలాంటి సమయం లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించి ఆశ్చర్య పరచాడు కార్తీక్ ఆర్యన్. కార్తీక్ ఆర్యన్ హీరో గా ‘సత్యనారాయణ కీ కథ’ అనే సినిమా రూపొందనున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా తనకి బాగా నచ్చిన కథ అని తెలిపాడు.
ఈ సినిమాకి దాదాపు నేషనల్ అవార్డు విన్నింగ్ టీం పని చేస్తుంది. నేను ఒక్కడినే ఇందులో నేషనల్ అవార్డు అందుకోనిది అన్నట్టు చమత్కరించాడు కార్తీక్. మారాఠి లో రూపొందిన ఆనంది గోపాల్ లాంటి నేషనల్ అవార్డు పొందిన సినిమాని డైరెక్ట్ చేసిన సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. సుశాంత్ సింగ్ నటించిన ‘చిచోరే’ లాంటి నేషనల్ అవార్డు మూవీ ని నిర్మించిన సాజిద్ నదియా వాలా నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. కరణ్ శ్రీకాంత్ శర్మ అందించిన కథ తో ఈ సినిమా రూపొందనుంది. 2022 లో ఈ సినిమా రానున్నట్టు కూడా ప్రకటించారు.