టాలీవుడ్: ఒక సినిమా ప్రారంభం అయింది అన్నా కానీ, హిట్ అయింది అన్నా కానీ ఆ సినిమా సాటిలైట్ రైట్స్ అంటే టెలివిజన్ లో ప్రసారం చేసే హక్కు కోసం పోటీ ఉంటుంది. అలాంటిది కొంచెం అంచనాలు ఎక్కువగా ఉన్న సినిమాలని లేదా హీరో లేదా డైరెక్టర్ వేల్యూ ని బట్టి కూడా సినిమా రైట్స్ కోసం డిమాండ్ మరియు రేట్స్ ఆధారపడి ఉంటాయి. లాక్ డౌన్ వల్ల మంచి డిమాండ్ ఉన్న సినిమాలు చాలా వరకు హోల్డ్ లో ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఇలా హోల్డ్ లో ఉన్న సినిమాల్లో చాలా సినిమాల శాటిలైట్ రైట్స్ ఒక తెలుగు ఛానల్ కొని ఆశ్చర్యపరిచింది. ఒకేసారి ఇన్ని సినిమాల రైట్స్ కొని బాగానే ఇన్వెస్ట్ చేసారు అనిపిస్తుంది.
ప్రస్తుతం స్టార్ మా వారి దగ్గర రాజమౌళి ‘RRR ‘ సినిమా , మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా , అల్లు అర్జున్ – సుకుమార్ ‘పుష్ప’ సినిమా, నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీనివాస్ ‘అఖండ’, నితిన్ ‘మేస్ట్రో’, రవి తేజ ‘ఖిలాడీ’, నాగ చైతన్య – సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’, నాని ‘టక్ జగదీశ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఇలా పెద్ద హీరో నుండి మీడియం రేంజ్ హీరో ల వరకు చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ రైట్స్ కొని మంచి లైన్ అప్ ని సెట్ చేసుకుంది స్టార్ మా నెట్ వర్క్. ప్రస్తుతం తెలుగు లో రేటింగ్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్న స్టార్ మా వరుసగా మంచి సినిమాలని సెట్ చేసుకుంటూ దూసుకెళ్తుంది. ఇలా స్టార్ మా కొన్న రైట్స్ అన్ని చూపిస్తూ ‘స్టార్ మా బ్లాక్ బస్టర్స్’ అనే పేరుతో ఒక వీడియో విడుదల చేసింది స్టార్ మా.