వాషింగ్టన్: స్పేస్ ఎక్స్ మరియు టెస్లా మోటర్స్ సీఈఓ ఎలోన్ మస్క్ యొక్క ఇంటర్నెట్ సర్వీసెస్ కంపెనీ అయిన స్టార్ లింక్ 69,420 మంది ఆక్టివ్ యూజర్లను చేరుకుందని, తమ “వ్యూహాత్మకంగా ముఖ్యమైన పరిమితి”ని దాటినట్లు ఆయన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇంకొక ట్వీట్ లో భూమి పై ఉన్న ధ్రువ ప్రాంతాల మినహా మిగతా ప్రపంచం మొత్తం ఆగస్టు నాటికి కవరేజీని ప్రారంభించబోతున్నట్లు ట్వీట్ చేశారు.
కాగా స్టార్ లింక్ కంపెనీ అధ్యక్షుడు గ్వైన్ షాట్ వెల్ ఇంటర్నెట్ సర్వీస్ సెప్టెంబర్ నాటికి ప్రపంచ కవరేజీని అందించవచ్చని ప్రకటించిన వారం తరువాత ఎలాన్ మస్క్ ఈ రకంగా ట్వీట్ చేశారు. మొత్తంగా 72 ఉపగ్రహాలు ఆగస్టు నెలలో క్రియాశీలం అవనున్నట్లు మరొక ట్వీట్ లో తెలిపారు.
ఇదిలా ఉండగా 69,420 అనే సంఖ్యపైనే చాలా మంది దృష్టి సారించిన పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక ట్విట్టర్ వినియోగదారుడు మస్క్ ని ఈ 69,420 అనే సంఖ్య ఎందుకు వ్యూహాత్మకం అని అడిగారు, అయితే మస్క్ సమాధానం ఇవ్వలేదు. మరో యూజర్ ఎయిర్ లైన్ వై-ఫై ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని అడిగారు.
ఈ ప్రశ్నకి సమాధానంగా మస్క్ ఇలా జవాబిచ్చారు, “గల్ఫ్ స్ట్రీమ్ లో చాలా మంది ప్రజలకు సేవలందించే బోయింగ్ 737, ఎయిర్ బస్ ఎ320లలో టెస్టింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 అక్టోబర్‌లో ఏలోన్ మస్క్ టెస్లా మోడల్ ఎస్ 69,420 డాలర్లకు లభిస్తున్నట్లు చెప్పినట్లు మరికొందరు ట్వీట్ చేశారు. అయితే, ఎలోన్ మస్క్ ఈ సంఖ్య (69,420) ఎందుకు అంత వ్యూహాత్మకంగా ముఖ్యమైనదని అన్నారో ఎవరికి అర్ధం కావడం లేదు. అయితే మరికొందరు బిట్‌కాయిన్ ధరను ఆ సంఖ్యకు చేరాలని పరోక్షంగా ఊతమిస్తున్నారేమో అని ఆలోచిస్తున్నారు.