బాలీవుడ్: ఇండియా లో ఒకప్పుడు పెద్ద సినిమా ఇండస్ట్రీ ఏది అంటే బాలీవుడ్ అని ఆ తర్వాత తమిళ్, తెలుగు మిగతా ఇండస్ట్రీ ల పేర్లు వినిపించేవి. బడ్జెట్ పరంగా, విజయాల పరంగా , కలెక్షన్ల పరంగా, బిజినెస్ పరంగా బాలీవుడ్ అగ్రస్థానంలో ఉండేది. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. ఒక రీజనల్ భాషలో రూపొందే సినిమాలకి దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. హిందీ సినిమాలని బీట్ చేసే స్థాయికి సౌత్ సినిమాలు ఎదిగాయి. ఈ దశలో ఎన్నో సౌత్ సినిమాల్ని హిందీ లో రీ-మేక్ చేసారు, చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు పదుల సంఖ్య లో సౌత్ సినిమాలు హిందీ లో రీమేక్ అవనున్నాయి.
తెలుగు లో విడుదలైన అర్జున్ రెడ్డి ని కబీర్ సింగ్ గా రూపొందించి సక్సెస్ పొందిన షాహిద్ కపూర్ నాని నటించిన ‘జెర్సీ‘ ని అదే టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. ‘కాంచన’ సినిమా ని ‘లక్ష్మి బాంబ్’ పేరుతో రూపొందించిన అక్షయ్ కుమార్ ‘రాచసన్’ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. విజయ్ మాస్టర్ సినిమాని సల్మాన్ ఖాన్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం లో’ సినిమాని కార్తీక్ ఆర్యన్ హీరో గా రూపొందిస్తున్నారు. కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమాని అజయ్ దేవగన్ హీరో గా రూపొందిస్తున్నారు, అదే అజయ్ దేవగన్ నిర్మాతగా అల్లరి నరేష్ నటించిన ‘నాంది’ సినిమాని రూపొందిస్తున్నాడు. దశాబ్దం క్రితం విడుదలైన ‘అపరిచితుడు’ సినిమాని రణ్వీర్ సింగ్ హీరోగా రీమేక్ చేయనున్నారు. ఇలా చాలా సౌత్ సినిమాలు హిందీ లో రీ-మేక్ అవడం చూస్తుంటే మరి కంటెంట్ దొరకక రీమేక్ చేస్తున్నారా లేక రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక తీసినవే మళ్ళీ తీస్తున్నారా అర్ధం కావట్లేదు.