టాలీవుడ్: చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా చిన్న వయసులోనే తన టాలెంట్ ని నిరూపించుకుని తెలుగులో ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది అవికా గోర్. తర్వాత ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి సినిమాలతో హిట్స్ సాధించి ఆ తర్వాత హిట్స్ పరంగా సినిమాల పరంగా వెనకపడింది. ఈ మధ్యనే లుక్స్ పరంగా మేక్ ఓవర్ అయ్యి వరుస సినిమాలతో బిజీ అయింది. ఈ రోజు అవికా పుట్టిన రోజు సందర్భంగా అవికా కి విషెస్ చెప్తూ ఆ సినిమా టీమ్స్ స్పెషల్ పోస్టర్స్ విడుదల చేసాయి. ఇవన్నీ చూస్తే ఒకే సారి 7 సినిమాల్లో అవికా బిజీ గా ఉంది అని అర్ధం అవుతుంది.
విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న, నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న ‘థాంక్ యు’ సినిమాలో ఒక హీరోయిన్ గా అవికా గోర్ నటిస్తుంది. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరో గా నటిస్తున్న GA2 ప్రొడక్షన్స్ వారి సినిమాలో అవికా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రోజు ఈ సినిమా నుండి అవికా కి సంబందించిన టీజర్ కూడా విడుదల చేసారు. ప్రెజర్ కుక్కర్ సినిమాతో గుర్తింపు సాధించిన సాయి రోనాక్ హీరోగా నటిస్తున్న ‘పాప్ కార్న్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. వీటితో పాటు నవీన్ చంద్ర తో హీరోయిన్ గా ఒక సినిమాలో, రవితేజ మన్యం దర్శకత్వంలో SR ఫిలిం మేకర్స్ బ్యానర్ లో అచ్చుత రామ రావు నిర్మాణంలో ఒక సినిమాలో, ఆది సాయికుమార్ హీరో గా నటిస్తున్న ‘అమరన్’ సినిమాలో , సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హేమంత్ అనే నూతన దర్శకుడి డైరెక్షన్లో ఒక సినిమాలో నటించనుంది. ఇలా వరుస సినిమాలతో ఎన్నడూ లేనంత బిజీ గా ఉంది అవికా గోర్.