అమరావతి: దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. అలాగే ఏపీ లో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఏపీలో గడచిన 24 గంటల్లో 97,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 3,797 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.
కాగా గత 24 గంటల్లో కరోనా బారిన పడి 35 మంది మరణించారు. వీటితో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 12,706 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 5,498 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 38 వేల 469 మంది డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా కేసులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. బులెటిన్ ప్రకారం ప్రస్తుతం ఏపీలో 38,338 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,19,93,618 మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు జరిగాయి.