లండన్: వన్డే క్రికెట్ మ్యాచ్ ల చరిత్రలో లంక అత్యంత చెత్తదైన రికార్డును నెలకొల్పింది. ఓడీఐల్లో ఎక్కువ మ్యాచ్‌ల్లో ఓడిపోయిన టీంగా శ్రీలంక మొదటిస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌తో ఆడుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్లో ఓడిన తరువాత లంక జట్టు 428వ పరాజయాన్ని నమోదు చేసుకుంది. మొత్తంగా ఇప్పటివరకు 858 వన్డే మ్యాచ్ లు ఆడిన శ్రీలంక 390 విజయాలు మరియు 428 పరాజయాలను చవిచూసింది. కాగా వన్డే మ్యచ్చుల్లో అధిక ఓటములు పొందిన రెండవ జట్టుగా టీమిండియా(427) ఉండడం మరో విశేషం.
అయితే టీమిండియా మ్యాచ్‌ల లెక్క ప్రకారం చూస్తే మాత్రం శ్రీలంకకు చాలా దూరంగా ఉంది. టీమిండియా మొత్తంగా ఇప్పటివరకు 993 వన్డే మ్యాచ్లు ఆడింది. శ్రీలంకతో పోలిస్తే భారత్ ఖాతాలో 137 మ్యాచ్‌లు అధికంగా ఉన్నాయి. ఇక విజయాల శాతం పరంగా చూస్తే భారత్ 54.67 శాతంతో ఉండగా, శ్రీలంక 47.69 శాతంతో ఉంది.
తర్వాత స్థానంలో 414 ఓటములతో పాకిస్తాన్ కొనసాగుతోంది. ఇంకొక విశేషమేమిటంటే, టీ20ల్లో అత్యధిక ఓటములు కలిగిన జట్టుగా శ్రీలంక(70) తొలి స్థానంలో ఉంది. వెస్టిండీస్ 67, పాకిస్తాన్ 65 ఓటములతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఈ మధ్యకాలంలో ఆడిన ప్రతీ సిరీస్‌లోనూ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. శ్రీలంక జట్టు వరుస ఓటములను చవిచూసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న శ్రీలంక స్వదేశంలో టీమిండియాను ఎదుర్కోబోతోంది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు టీమిండియా రెండో జట్టును ఓడించి సిరీస్‌లను కైవసం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి.