ముంబై: ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నపాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఆఫ్రిది భారత్ పై మరో సారి నోరు పారేసుకున్నాడు. టీం ఇండియా క్రికెటర్లు పాక్ తో ఒడిపోయిన ప్రతి సారి తమను క్షమించమని అడిగే వారని ఆ జట్టు మీద తమ ఆధిపత్యం ఆ స్థాయిలో ఉండేదని వ్యాఖ్యానించాడు. అలాగే తాను పెద్ద జట్లయిన ఆస్ట్రేలియా, భారత్ తో క్రికెట్ ఆడడాన్ని ఎక్కువగా ఆస్వాదించే వాడిని అని షాహిద్ చెప్పాడు. అలాగే తాను ఆడిన అన్ని ఇన్నింగ్స్ లో, 1999 లో చెన్నై లో భారత్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 141 పరుగులు స్కోర్ చేయడాన్ని మర్చిపోలేనిది గా అభివర్ణించాడు. ఆ సమయంలో వసీం భాయ్ (అక్రమ్) మరియు చీఫ్ సెలెక్టర్ తనకు చాలా మద్దతు ఇచ్చారని అది చాలా కష్టమైన పర్యటన మరియు కీలక ఇన్నింగ్స్ అని అఫ్రిది పేర్కొన్నారు.
1996 లో అఫ్రిది అరంగేట్రం చేసినప్పటి నుండి, భారత్ 105 మ్యాచ్‌ల్లో (15 టెస్టులు, 82 వన్డేలు, 8 టి 20 ఐ) 51 సార్లు పాకిస్థాన్‌ను ఓడించింది, ఐదు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి మరియు రెండు ఫలితం లేదు. కాశ్మీర్‌పై ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరియు భారత మాజీ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్‌తో ఆయన చేసిన మాటల యుద్ధం ఆయనకు, భారతీయ అభిమానులకు మధ్య ఉన్న సంబంధాన్ని గణనీయంగా దెబ్బతీసిందని, అయినప్పటికీ అప్పుడు తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నట్లు అఫ్రిది అన్నారు.
పాకిస్థాన్‌పై క్రికెట్ పోటీ విషయానికి వస్తే భారత జట్టుకు ఇటీవల అదృష్టం వరించిందని, అయినప్పటికీ మొత్తం హెడ్-టు-హెడ్ రికార్డ్ ఇప్పటికీ గ్రీన్ షర్ట్‌లకు చెందినదే అని చెప్పుకొచ్చాడు. 2016 లో భారత్ లో జరిగిన T20 వరల్డ్ కప్ కి ఆఫ్రిది సారధ్యం వహించాడు. పాకిస్తాన్లో క్రికెట్ రాయబారిగా తిరిగినప్పటికీ తాను భారతదేశంలోని క్రికెట్ అభిమానుల ద్వారా ఎక్కువ ప్రేమాభిమానాలు అందుకున్నాను అని పేర్కొన్నాడు.