fbpx
Sunday, December 29, 2024
HomeNationalమహారాష్ట్రలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

మహారాష్ట్రలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

12-BJP-MLAs-SUSPENDED-IN-MAHARASHTRA-ASSEMBLY

ముంబై: మహారాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రతిపక్ష పార్టీల నిరసనల మధ్యనే ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో ఓబీసీ కోటాపై సోమవారం జరిగిన చర్చ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ నాయకులు తమ నిరసనను తెలిపారు.

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ని దూషిండచడమే కాక చేయి చేసుకున్నారనే ఆరోపణలపై, ఒకే సారి 12 మంది బీజేపీ ఎమ్మేల్యేలపై ఒక ఏడాది పాటు అనర్హత వేటు వేశారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో ఓబీసీ కోటాపై చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఓబీసీ కోటా బిల్లుపై చర్చ చేయడానికి అసెంబ్లీ స్పీకర్‌ భాస్కర్‌ జాధవ్‌ తమకు తగినంత సమయం ఇవ్వలేదని ఆగ్రహించిన బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం దగ్గరకు వచ్చి ఆందోళనలు చేపట్టారు.

తరువాత ఆయన క్యాబిన్‌లోకి వెళ్లి స్పీకర్‌ని దూషించడమేకాక కొట్టడానికి కూడా ప్రయత్నించినట్లు సమాచారం. దాంతో సదరు బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడమే కాక, అసెంబ్లీ సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవంద్ర ఫడ్నవీస్‌ మాట్లాడుతూ, మా ఎమ్మెల్యేలపై చేస్తున్నవన్ని అసత్య ఆరోపణలన్నారు.

స్పీకర్‌ని దూషించడం, దాడి చేయడం అనేది అధికార పార్టీ అల్లిన కట్టుకథ. ఓబీసీల కోసం మేం మరికొంత మంది ఎమ్మెల్యేలను కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. స్పీకర్‌ కూడా మా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అని అన్నారు.

ఈ ఘటనపై అఎంబ్లీ స్పీకర్‌ జాధవ్‌ మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకులు నా క్యాబిన్‌ దగ్గరకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చూస్తూ దూషించారు. ఇదంతా దేవంద్ర ఫడ్నవీస్‌, సీనియర్‌ నాయకుడు చంద్రకాంత్‌ పాటిల్‌ ఎదురుగానే జరిగింది. కొందరు నాయకులు నా మీద చేయి చేసుకున్నారు. అందుకే ఆ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశాను. దీనిపై పూర్తి స్థాయిలో విచారించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మినిస్టర్‌ని కోరాను’’ అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular