టాలీవుడ్: 2003 లో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి 2005 లో అతనొక్కడే సినిమాతో సూపర్ సక్సెస్ సాధించి హీరో గా తొలి అడుగులు వేసాడు కళ్యాణ్ రామ్. తర్వాత అడపా దడపా కొన్ని హిట్స్ పొంది నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు హిట్లు ప్లాపులు చూసాడు. చివరగా ‘పటాస్’ సినిమాతో హిట్ సాధించారు. 2020 లో కళ్యాణ్ రామ్ హీరో గా వచ్చిన ఎంత మంచి వాడవురా సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ రోజు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాలు ప్రకటించడం తో పాటు ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేసారు.
కళ్యాణ్ రామ్ 21 వ సినిమా గా ఈ సినిమా రూపొందనుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై దేవేన్ష్ నామ సమర్పణలో అభిషేక్ నామా నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. ‘డెవిల్’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనున్నట్టు ఈరోజు ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేసారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటించనున్నట్టు పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసారు మేకర్స్. ఈ సినిమా పీరియాడిక్ కథ నేపథ్యం లో ఉన్నట్టు అర్ధం అవుతుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక డిటెక్టివ్ పాత్రలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఫస్ట్ లుక్ లో గుబురు గడ్డం తో చేతిలో గన్ పట్టుకుని ట్రైన్ లోంచి దిగుతూ ఎవర్నో షూట్ చేస్తున్నట్టు ఉన్న పోస్టర్ ఆకట్టుకుంది. ఈ సినిమాతో నవీన్ మేడారం అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బింబిసార అనే హిస్టారిక్ కథాంశంలో నటిస్తున్నాడు. ఈ డెవిల్ సినిమా కూడా పీరియాడిక్ నేపథ్యం లో ఉన్న సినిమానే. ఇలా రెండు సినిమాల్లో ఒకే సారి హిస్టారిక్ నేపథ్యంలో నటిస్తున్నాడు కళ్యాణ్ రామ్. వీటితో పాటు దిల్ రాజు నిర్మాణంలో కూడా ఒక సినిమా చేయనున్నట్టు ఈరోజు ప్రకటించారు. ఇలా కళ్యాణ్ రామ్ వరుస సినిమాలు చేస్తూ మరిన్ని సక్సెస్ లు సాధించాలని ఆశిద్దాం.