fbpx
Friday, November 1, 2024
HomeTelanganaతెలంగాణలో కరోనా పరిస్థితిపై హైకోర్టు విచారణ !

తెలంగాణలో కరోనా పరిస్థితిపై హైకోర్టు విచారణ !

HIGHCOURT-REVIEWS-COVID-SITUATION-IN-TELANGANA

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని కరోనా సెకంద్ వేవ్ పరిస్థితులపై బుధవారం విచారణ చేసింది. వైద్య ఆరోగ్య, విద్య, శిశు సంక్షేమ శాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీసు, జైళ్ల శాఖలు తమ తమ నివేదికలను హైకోర్టుకు అందించాయి.

ప్రభుత్వం డెల్టా ప్లస్‌ వేరియంట్‌ పట్ల చాలా అప్రమత్తంగా ఉందని డీహెచ్‌ శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదు అవలేదని, ఒక వేళ మూడో దశ కరోనా వస్తే ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నెల రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్‌ సదుపాయాలు కల్పిస్తున్నట్లు కోర్టుకు డీహెచ్‌ తెలిపారు.

అలాగే 6,127 ఖైదీలకు మొదటి డోసు, 732 మంది ఖైదీలకు రెండు డోసుల వ్యాక్సినేషన్ అందించినట్లు జైళ్ల శాఖ తెలిపింది. మరో 1,244 మంది ఖైదీలకు ఇంకా వ్యాక్సిన్ వేయాల్సి ఉందని జైళ్ల శాఖ డీజీ పేర్కొన్నారు. మాస్క్‌లు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు డీజీపీ తెలిపారు. ‘‘జూన్‌ 20 నుంచి ఈనెల 5 వరకు 87,890 కేసులు నమోదు చేసి, రూ.52 కోట్ల జరిమానా విధించామని’’ కోర్టుకు డీజీపీ వివరించారు.

శిశు సంక్షేమ శాఖ రాష్ట్రంలో కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన చిన్నారుల బాగోగులు చూసుకుంటున్నామని కోర్టుకు తెలిపింది. ఆన్‌లైన్‌ బోధన మార్గదర్శకాలను పాఠశాల విద్య డైరెక్టర్‌ శ్రీదేవసేన, కోర్టుకు సమర్పించారు. విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు మాత్రమే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వర్షాకాలంలో దోమల నియంత్రణకు చర్యలు చేపట్టామని హైకోర్టుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular