న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్త కేబినెట్ ను నిన్న ప్రకటించారు, వెంటనే అందరూ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని నూతన జంబో కేబినెట్ నిన్న సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసారు.
తాజాగా చేసిన కేబినెట్ విస్తరణతో మహిళా మంత్రుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తమ నూతన మహిళా మంత్రి సహచరులతో దిగిన ఒక ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది.
కొత్తగా కేబినెట్‌లో చేరిన మహిళా మంత్రులకు అభినందనలు తెలుపుతూ బయోకానీ ఎండీ కిరణ్ మజుందార్‌షా సమా పలువురు మహిళా దిగ్గజాలతో పాటు, ఇతర ప్రముఖులు కూడా ఈ ఫోటోను షేర్ చేశారు. కేంద్ర మంత్రి అయిన స్మృతి ఇరానీతో సహా మొత్తం ఇప్పుడు తొమ్మిది మందితో కలిసి దిగిన ఫోటోను ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు.