కోలీవుడ్: కరోనా సెకండ్ వేవ్ తగ్గి థియేటర్ లు తెరుచుకునే సమయం వచ్చినా కూడా ఇంకా కొన్ని సినిమాలు ఓటీటీ లో విడుదల అవుతున్నాయి. ఈ రోజు ఆ జాబితా లోకి మరొక సినిమా వచ్చి చేరింది. ఆర్య నటించిన ‘సర్పట్టా‘ సినిమా ఓటీటీ లో విడుదలవనున్నట్టు ఈరోజు ప్రకటించారు. బాక్సింగ్ క్రీడా నేపధ్యం లో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ మంచి అంచనాలని క్రియేట్ చేసింది కానీ అనుకోకుండా ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు నిర్మాతలు. రజిని కాంత్ తో ‘కబాలి’, ‘కాలా’, కార్తీ తో ‘మద్రాస్’ లాంటి సినిమాలని రూపొందించిన పా.రంజిత్ ఈ సినిమాని డైరెక్ట్ చేసారు.
ఒక వెనకబడ్డ ఏరియా నుండి వచ్చినా ఒక వ్యక్తి పెద్ద పేరున్న బాక్సర్ గా ఎలా మారాడు అనేది సినిమా కథ. ఈ సినిమా బ్రిటిష్ పాలించిన ఇండియా టైం లో పీరియాడిక్ సినిమా గా రూపొందింది. ఆర్య ఇదివరకు 1947 లో ఒక లవ్ స్టోరీ అనే సినిమా కూడా ఇలాంటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలోనే నటించాడు కానీ అది లవ్ స్టోరీ ఇది ఒక స్పోర్ట్స్ బేస్డ్ మూవీ. ఈ సినిమాలో బాక్సర్ గా ఎదిగే క్రమం లో ఆ కాలంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు , ఛాలెంజెస్ ని ఎలా ఫేస్ చేసాడు అనేవి ఆకట్టుకునేలాగా తెరకెక్కించారని అనిపిస్తుంది. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాని K9 స్టూడియోస్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్ పై షణ్ముగం దక్షన్రాజ్ నిర్మించారు. జులై 22 న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలవనుంది.