బాలీవుడ్: తెలుగు సినిమాలతో లవర్ బోయ్ గా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం తన కెరీర్ లో టాప్ ఫార్మ్ లో ఉన్న హీరో నాగ చైతన్య. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాని విడుదలకి సిద్ధం చేసి, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘థాంక్ యు’ సినిమా దాదాపు షూటింగ్ ఫినిష్ చేసి ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ సినిమా షూట్ లో బిజీ అవుతున్నాడు. ఎన్నో రోజుల నుండి నాగ చైతన్య బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఈ రోజు ఈ సినిమా షూట్ నుండి చైతన్య ఒక పిక్ విడుదల చేసి తాను బాలీవుడ్ సినిమాలు నటిస్తున్నట్టు తెలిపారు.
ఆమిర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో చైతూ నటిస్తున్నట్టు ఈ రోజు పిక్ విడుదల చేసాడు చైతన్య. ఈ సినిమాలో చైతన్య ఒక ఆర్మీ వారియర్ లాగ కనిపించనున్నాడు. మొదట విజయ్ సేతుపతి ఈ పాత్ర చేయాల్సి ఉండగా విజయ్ సేతుపతి తప్పుకోవడం తో చైతన్య కి ఈ అవకాశం వచ్చింది. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ లో కూడా ఆర్మీ యూనిఫామ్ లో ఉన్న చైతూ ని మరియు అమిర్ ఖాన్ ని చూడవచ్చు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న చైతూ సక్సెస్ సాధించాలని ఆశిద్దాం.