టాలీవుడ్: 100 % తెలుగు మార్క్ తో కంటెంట్ ని పెంచుకుంటూ పోతుంది ఆహా. తమిళ్, మళయాళం సినిమాలని డబ్ చేస్తుండడం తో పాటు ఓటీటీ కోసం సినిమాలని సిరీస్ లని రెడీ చేస్తూ రిలీజ్ చేస్తుంది. కేవలం చిన్న నటులతోనే కాకుండా పెద్ద నటులు, డైరెక్టర్ లతో కూడా ఓటీటీ కంటెంట్ ని రెడీ చేస్తుంది. అలాంటి ఒక ప్రయత్నమే ‘కుడి ఎడమైతే‘ అనే వెబ్ సిరీస్ ద్వారా ఆహా వారు చెయ్యబోతున్నారు. ‘లూసియా’, ‘యూ టర్న్’ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లని రూపొందించిన పవన్ కుమార్ దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ లో అమలా పాల్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. అమలా పాల్ కి సంబందించిన టీజర్ విడుదల చేసారు.
ఈ సిరీస్ లో అమలా పాల్ ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ పాత్రలో నటిస్తుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 29 న జరిగిన ఒక పిల్లవాడి కిడ్నాప్ కి సంబందించిన మిస్టరీ గా ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఫిబ్రవరి 28 రాత్రి డ్యూటీ లో ఉన్న అమలా పాల్ ఈ కేసు ని హ్యాండిల్ చేయబోతున్నట్టు చూపించారు. అమలా పాల్ పాత్ర స్వభావం ఎలా ఉంటుందని కూడా ఈ టీజర్ ద్వారా పరిచయం చేసారు. తాను ఎప్పుడూ తన ఆలోచనల్లో ఒంటరిగా ఉంటుందని.. వేరే వాళ్ళతో కలవలేకనా లేక ఇలాగే ఉంటే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. ఎవరు మనల్ని ప్రశ్నించారు కూడా.. మనం చేసిందే కరెక్ట్.. అంటూ అమలా పాల్ పాత్ర స్వభావం గురించి చెప్పారు. జులై 16 నుండి ఆహా ఓటీటీ లో ఈ సిరీస్ అందుబాటులో ఉండనుంది