టాలీవుడ్: ‘అఖిల్’ సినిమాతో పరిచయం అయ్యి మొదటి సినిమా డిసాస్టర్ మూటకట్టుకుని ‘హలో’ సినిమాతో పరవాలేదనిపించాడు అక్కినేని వారసుడు అఖిల్. తర్వాత మిస్టర్ మజ్ను అనే సినిమాతో మరో యావరేజ్ మూవీ లో నటించాడు. తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉంది. పూర్తి రొమాంటిక్, కామెడీ, ఫామిలీ ఎంటర్టైనర్ లా రూపొందిన ఈ సినిమా థియేటర్లు తెరచుకున్నాక విడుదలయ్యే సినిమాల లిస్ట్ లో ముందు వరుసలో ఉంది. దీని తర్వాత అఖిల్ తన 5 వ సినిమా స్టైలిష్ డైరెక్టర్ ‘సురేందర్ రెడ్డి’ దర్శకత్వంలో చేయనున్నాడు.
చిరంజీవి తో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా రూపొందించిన తర్వాత సురేందర్ రెడ్డి చేయనున్న సినిమా ఇది. ఏజెంట్ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా ని మొదటి నుండి హాలీవుడ్ రేంజ్ లో ప్రెసెంట్ చేస్తున్నారు. అఖిల్ లుక్స్, పోస్టర్ డిజైన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి అని చెప్పవచ్చు. ఈ రోజు సురేందర్ రెడ్డి ఒక ఫోటో విడుదల చేసి అంచనాలు ఇంకా పెంచారు. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న అఖిల్ బ్యాక్ పిక్ ఒకటి షేర్ చేసి ఇది కేవలం ఆరంభం మాత్రమే ముందు ముందు మీకింకా పండగే అని షేర్ చేసారు. ఈ పిక్ లో అఖిల్ బీస్ట్ లుక్ లో నెవెర్ బిఫోర్ ఇన్ టాలీవుడ్ అన్నట్టు ఉన్నారు. వీ షేప్ లో ఉన్న అఖిల్ బీస్ట్ బాడీ పైన పందానికి సిద్ధం అయిన పొట్టేలు టాటూ ప్రెసెంట్ చేసారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.