fbpx
Friday, October 18, 2024
HomeMovie Newsఓటీటీ లోనే వెంకటేష్ 'నారప్ప'

ఓటీటీ లోనే వెంకటేష్ ‘నారప్ప’

Venkatesh Naarappa ReleaseDate

టాలీవుడ్: తమిళ్ లో ధనూష్ హీరో గా విడుదలై సూపర్ హిట్ సాధించిన సినిమా ‘అసురణ్’. ఈ సినిమాతో ధనూష్ నేషనల్ అవార్డు తో పాటు తమిళ్ లో బెస్ట్ మూవీ గా నేషనల్ అవార్డ్స్ ని పొందింది ఈ సినిమా. వెట్రి మారన్ దర్శకత్వంలో తమిళ్ నేటివిటీ కి దగ్గరగా రూపొందిన ఈ సినిమాని తెలుగు లో రీమేక్ చేసారు. వెంకటేష్ హీరో గా , శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. పూర్తి తమిళ్ నేటివిటీ సినిమాని తెలుగు లో ఇక్కడి పరిస్థితులకి తగ్గట్టు రూపొందించడం ఛాలెంజింగ్ టాస్క్, శ్రీకాంత్ అడ్డాల ఈ టాస్క్ ని బాగానే హ్యాండిల్ చేసాడని ఇన్సైడ్ టాక్. షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా మే లోనే విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాని వాయిదా వేశారు.

ఓటీటీ రిలీజ్ లేదా థియేటర్ రిలీజ్ అని సందేహంగా ఉన్న ఈ సినిమా రిలీజ్ కి సంబందించిన క్లారిటీ ఇవాళ విడుదల చేసారు మేకర్స్. జులై 20 న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో ప్రియమణి , కార్తీక్ రత్నం మరి కొన్ని పాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేష్ యంగ్ లుక్ మరియు మీడియం ఏజ్ లుక్స్ లో కనిపించనున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు వీ.క్రియేషన్స్ బ్యానర్స్ పై సురేష్ బాబు మరియు కలైపులి.ఎస్.తాను ఈ సినిమాని నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular