ప్యారిస్: గూగుల్(ఆల్ఫాబెట్స్ గూగుల్)కు ఫ్రాన్స్ కాంపిటీషన్ రెగ్యులేటర్ మంగళవారం భారీ స్థాయిలో జరిమానా విధించింది. యూరోపియన్ యూనియన్ కాపీరైట్స్ నిబంధనల ప్రకారం, స్థానిక మీడియా హౌజ్‌ల కంటెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా గూగుల్ న్యూస్ వాడుతోందని పేర్కొంటూ 500 మిలియన్ యూరోలను ఫైన్ గా విధించింది. మన కరెన్సీలో ఆ జరిమానా విలువ సుమారు రూ.4,415 కోట్లకు పైనే ఉంటుంది.
గూగుల్ కు చెందిన గూగుల్ న్యూస్‌లో తమ వెబ్‌సైట్లకు చెందిన సమాచారాన్ని తమ అనుమతి లేకుండా చూపిస్తుండడంపై అభ్యంతరం తెలుపుతూ కొన్ని న్యూస్ ఏజెన్సీలు గతంలో ఫ్రాన్స్ కాంపిటీషన్ రెగ్యులేటర్‌ను ఆశ్రయించాయి. కాగా ఈ మేరకు మీడియా హౌజ్‌లతో సంప్రదింపులు జరపాలని గూగుల్‌కు తెలిపినప్పటికీ, గూగుల్ నిర్లక్ష్యం వహించడంతో యాంటీట్రస్ట్ రెగ్యులేటర్స్ కింద ఇప్పుడు ఈ భారీ జరిమాను విధించింది.
దానితో పాటు కాపీరైటెడ్ కంటెంట్‌ను వాడుకుంటున్నందుకు మీడియా పబ్లిషర్లకు రెమ్యునరేషన్ చెల్లించాలని, లేని పక్షంలో ప్రతిరోజుకు 9 లక్షల యూరోలను అదనంగా ఏజెన్సీలకు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని ఫ్రాన్స్ గూగుల్ ను హెచ్చరించింది.