బాలీవుడ్: మహేష్ బాబు నటించిన ‘1 – నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది కృతి సనన్. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా అడుగులు వేస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో కూడా సీత పాత్రలో కృతి నటిస్తుంది. కృతి నటించిన ‘మిమి’ అనే సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల అవనుంది. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది.
సర్రోగసి అంటే తెలియని ఒక మామూలు అమ్మాయి వేరే దేశస్థుల కోసం, డబ్బు కోసం సర్రోగసి ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటుంది. ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు వచ్చి తమకి బిడ్డ అవసరం లేదు అని చెప్పి వెనక్కి వెళ్లి పోతారు. ఇలాంటి సంశయ స్థితిలో ఉండే ‘మిమి’ పాత్రలో కృతి సనన్ ఆకట్టుకుంది. మొదటి లో ఉండే చలాకి పాత్రలో, ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత ఎమోషనల్ సీన్స్ లో కృతి బాగానే నటించినట్టు తెలుస్తుంది. టెక్నాలజీ గురించి తెలియని అమాయక పాత్రలో, డబ్బుల కోసం రిస్క్స్ చెయ్యొచ్చు అనే చలాకి పాత్రలో కృతి నటన ట్రైలర్ లో ఆకట్టుకుంది.
ఈ సినిమాలో మరో ప్రత్యేక పాత్రలో పంకజ్ త్రిపాఠి నటించారు. కృతి ని మోటివేట్ చేసి సరోగసీ కి ఒప్పించడం ఇంకా మరి కొన్ని సీన్స్ లో పంకజ్ త్రిపాఠి మరియు కృతి మధ్యన ఉండే సీన్స్, ఈ సీక్వెన్స్ లో జరిగే కామెడీ బాగానే ఆకట్టుకునేట్లు ఉందనిపిస్తుంది. జియో స్టూడియోస్ సమర్పణలో దినేశ్ విజన్ ఈ సినిమాని నిర్మించాడు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఏ.ఆర్. రహమాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో ఈ సినిమా జులై 30 న విడుదల అవనుంది.