fbpx
Thursday, October 31, 2024
HomeInternationalకోహ్లీ వార్నర్ లను దాటేసిన బాబర్ అజాం

కోహ్లీ వార్నర్ లను దాటేసిన బాబర్ అజాం

BABAR-CROSSES-VIRAT-WARNER-WITH-14CENTURIES-IN-81INNINGS

న్యూఢిల్లీ: పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ మరో ఘనతను సాధించాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 సెంచరీలు బాదిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన మూడో ఓడీఐ మ్యాచ్ లో బాబర్ ఆజామ్ (139 బంతుల్లో 158; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో అదరగొట్టి కెరీర్‌లో తన 14వ శతకాన్ని నమోదు చేశాడు. కాగా బాబర్ ఈ ఘనతను కేవలం 81 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకున్నాడు.

ఇప్పటికే ఈ జాబితాలోని దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా(84 ఇన్నింగ్స్‌లు), ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్(98 ఇన్నింగ్స్‌లు), టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (103 ఇన్నింగ్స్‌లు)‌ అందరినీ వెనక్కు నెట్టి మొదటి స్థానంలోకి ఎగబాకాడు.

ఇలా ఉండగా, బాబర్‌ ఆజమ్‌ వన్డేల్లో 150కిపైగా పరుగులు చేసిన తొలి పాకిస్థాన్ క్రికెటర్‌ గా నిలిచాడు. కానీ బాబర్ సెంచరీ చేసినా పాక్‌కు మాత్రం ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ యువ బ్యాట్స్‌మెన్ జేమ్స్ విన్స్(95 బంతుల్లో 102; 11 ఫోర్లు) సూపర్ సెంచరీ సాధించడంతో పాకిస్థాన్‌ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో ఇంగ్లండ్ క్వీన్ స్వీప్ చేసింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్న చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 331 రన్స్ చేసింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(56), మహ్మద్ రిజ్వాన్(74) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రిడన్ కేర్స్ (5/61) ఐదు వికెట్లతో రాణించగా.. సకీబ్ మహమూద్(3/60) మూడు, మాట్ పార్కిన్సన్ ఓ వికెట్ తీశాడు. అనంతరం ఛేదనలో జేమ్స్ విన్స్(102), లూయిస్‌ గ్రెగరి(77) రాణించడంతో ఇంగ్లండ్‌ జట్టు మరో రెండు ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular