బాలీవుడ్: బాలీవుడ్ లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్దాలు, టెర్రరిస్ట్స్ అట్టాక్స్ కి సంబందించిన సినిమాలు బాగానే వచ్చాయి వస్తున్నాయి. వచ్చే నెలలో అజయ్ దేవగన్ నటించిన భుజ్ అనే ఈసినిమా కూడా హాట్ స్టార్ ఓటీటీ లో విడుదల అవనుంది. 1970 లో రాజస్థాన్ లోని భుజ్ అనే ప్రాంతంలో జరిగిన నేవీ ఎటాక్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇపుడు 1998 లో కార్గిల్ యుద్ధం లో జరిగిన ఒక ఘట్టం ఆధారంగా ‘షేర్షా’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా కూడా వచ్చే నెలలో ఓటీటీ లో విడుదల అవనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
సిద్దార్థ్ మల్హోత్రా హీరో గా 1998 -99 జరిగిన కార్గిల్ వార్ నేపథ్యం లో ఈ సినిమా రూపొందింది. ఇండియా లో మొదటి సారి వార్ ని టెలికాస్ట్ చేసిన యుద్ధం గా ఈ యుద్దానికి పేరుంది. 16000 అడుగుల ఎత్తులో శత్రువులతో యుద్ధం చేసి జయించిన యుద్ధం లో ఎంతో మంది వీరమరణం చెందారు. ఈ యుద్ధంలో పాల్గొన్న పరమ వీర చక్ర అవార్డు గ్రహీత 24 ఏళ్ళ కెప్టెన్ విక్రమ్ బాత్రా చేసిన బ్రేవ్ అట్టెంప్ట్ ఆధారం గా ఈ సినిమా రూపొందించినట్టు వీడియో లో తెలిపారు. ఇతని కోడ్ నేమ్ ‘షేర్ షా’ ఆధారంగా ఈ సినిమాకి ‘షేర్ షా’ అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో సిద్దార్థ్ కి జోడీ గా కియారా అద్వానీ నటిస్తుంది. తెలుగు లో ‘పంజా’ సినిమాని డైరెక్ట్ చేసిన విష్ణు వర్ధన్ ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. ఈ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 13 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది.