టాలీవుడ్: రాజమౌళి కన్నా ముందు సౌత్ సినిమా ఇమేజ్ ని దేశం మొత్తం చాటేలా చేసిన దర్శకుడు శంకర్. ఆయన భారీ సినిమాలకి, భారీతనానికి, స్టోరీ కి మంచి పేరుంది. మొదటి సినిమా జెంటిల్ మాన్ నుండి భారీ సినిమాల్ని రూపొందించి భారీ సక్సెస్ లని సాధించాడు. ఆయన తీసిన ఎన్నో సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. ప్రస్తుతం కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2 ‘ సినిమాని రూపొందిస్తున్నాడు. ఆ సినిమా కొన్ని వివాదాల్లో ఉండడం తో సినిమా ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయింది. దీనితో పాటు బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ హీరోగా అపరిచితుడు సినిమాని రీమేక్ చేయనున్నాడు.
శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. శంకర్ ఒక తెలుగు హీరో తో చేయడం ఇదే మొదటి సారి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా థమన్ ని ఎంచుకున్నారు. శంకర్ మొదటి సినిమా నుండి ఏ.ఆర్ రెహమాన్ తోనే సినిమాలు తీసాడు. మధ్యలో అపరిచితుడు, స్నేహితుడు సినిమాలని హరీష్ జయరాజ్ ని తీసుకున్నా కానీ రోబో కి వచ్చే సరికి మళ్ళీ ఏ.ఆర్. రెహమాన్ నే తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి మొదటిసారి ఇంకో సంగీత దర్శకుడితో పని చేయనున్నాడు. రామ్ చరణ్ 15 వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాని 2022 చివరికల్లా సిద్ధం చెయ్యాలని చూస్తున్నారు.