హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సింగరేణి కార్మికులకు శుభవార్త తెలిపారు. సింగరేణిలో పని చేసే కార్మికులకు పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచారు. దినికి సంబంధించి ఈనెల 26 న జరిగనున్న బోర్డు సమావేశంలో ఈ పెంపును అమలు చేసే తేదీని ప్రకటించాలని ఆయన సింగరేణి ఎండీ శ్రీధర్‌కు ఆదేశించారు.
కోల్‌బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మరియు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, మేరకు ఈ పదవీ విరమణ పెంపు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ తాజా నిర్ణయం వల్ల మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు మరియు అధికారులకు లబ్ధి జరగనుంది. అలాగే రామగుండంలో సింగరేణి వైద్య కళాశాల ఏర్పాటుకు కూడా సీఎం ఆదేశించారు. వీటికి సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి.
మంగళవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ‘సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కారాలు’ అనే అంశంపై ఆ ప్రాంత పరిధి ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమీక్ష చేసిన తరువాత పలు అంశాలపై చర్చ జరిపారు.