టాలీవుడ్: ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించి సంక్రాంతి రాజు అని పిలిపించుకున్న నిర్మాత ‘ఎం.ఎస్.రాజు‘. కాల క్రమేణా కొన్ని ప్లాప్ లు ఎదుర్కొని సినిమాలు పెద్దగా నిర్మించట్లేదు. దర్శకుడిగా అపుడప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా ‘డర్టీ హరి’ అనే రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాని రూపొందించి పరవాలేదనిపించాడు. ప్రస్తుతం ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో ‘7 డేస్ 6 నైట్స్’ అనే సినిమా రూపొందనుంది. ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
‘తూనీగ తూనీగ’ సినిమాతో హీరో గా పరిచయం అయ్యాడు ఎం.ఎస్.రాజు కుమారుడు సుమంత్. ఈ సినిమాలో తన కుమారుడు సుమంత్ ని ‘తూనీగ తూనీగ’ సినిమా తర్వాత రెండోసారి డైరెక్ట్ చేయనున్నాడు ఎం.ఎస్.రాజు. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న తండ్రీ కొడుకులకు ఈ సినిమా సక్సెస్ అత్యవసరం. టైటిల్ తెలిసినా కూడా ఈ సినిమాలో నటీ నటుడు ఎవరు అనే విషయం తెలియదు. ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో సుమంత్ తో పాటు హీరోయిన్ మెహర్ చావల్ ని రివీల్ చేసారు మేకర్స్. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పై హీరో సుమంత్ అశ్విన్ మరో ప్రొడ్యూసర్ ఎస్. రజినీకాంత్ తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.