కోలీవుడ్: తమిళ్ లో అంథాలజీ సిరీస్ లు మెల్లి మెల్లిగా ఊపందుకుంటున్నాయి. కరోనా సమయంలో ఇబ్బందులు పడ్డ ఎంతో మంది తమిళ ప్రజల కోసం ఆ ఇండస్ట్రీ అంతా ఏకమై ఒక అంథాలజీ సిరీస్ ని రూపొందించింది. ఈ సిరీస్ కోసం ఎలాంటి రెమ్యూనిరేషన్ లేకుండా ఇండస్ట్రీ లో ఉన్న టాప్ ఆక్టర్స్, టెక్నీషియన్స్ నటించారు. ‘నవరస’ – 9 కథలు, 9 ఎమోషన్స్ అంటూ ఈ సిరీస్ రూపొందించారు. మనం నటనలో నవరసాలు అని పిల్చుకునే ఆనందం, బాధ, దుఃఖం, కోపం లాంటి 9 రకాల ఎమోషన్స్ కి 9 కథలని రూపొందించి ఈ 9 కథలకి ఇండస్ట్రీ లో ఉన్న టాప్ డైరెక్టర్లు 9 మంది పని చేసి ఈ సిరీస్ ని రూపొందించారు. ఈ సిరీస్ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ఈ సిరీస్ లో ఉన్న స్టార్ కాస్ట్ మొత్తాన్ని చూపించడానికి ఈ ట్రైలర్ సరిపోయింది అని చెప్పుకోవచ్చు. టెక్నీకల్ గా అద్భుతంగా ఉండబోతుంది అని ట్రైలర్ ద్వారా అర్ధం అవుతుంది.
సూర్య, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి, అరవింద స్వామి, గౌతమ్ మీనన్, అధర్వ, సిద్దార్థ్, బాబీ సింహా, నిత్యా మీనన్, పార్వతి మీనన్, ఐశ్వర్య రాజేష్, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్, అంజలి, రేవతి, ఢిల్లీ గణేష్, ప్రయాగ మార్టిన్, రోహిణి, యోగి బాబు, అదితి బాలన్ లాంటి మంచి టాలెంట్ ఉన్న కోలీవుడ్ నటులు అందరూ ఈ సిరీస్ లో రకరకాల పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్, శ్రీలంక అల్లర్లు, ఫామిలీ ఎమోషన్స్, రెలిజియస్ ఫైట్స్, లవ్ ఇలా చాలా రకాల ఎలిమెంట్స్ ని ట్రైలర్ లోచూపించారు. వెట్రిమారన్, గౌతమ్ మీనన్, వసంత్, కార్తీక్ సుబ్బరాజ్, అరవింద స్వామి, కార్తీక్ నరేన్, బిజోయ్ నంబియార్ లాంటి డైరెక్టర్స్ ఈ సిరీస్ కి పని చేసారు. మణి రత్నం మరియు జయేంద్ర ఈ సిరీస్ ని నిర్మించారు. ఆగష్టు 6 నుండి ఈ సిరీస్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది.