టాలీవుడ్: జాంబీ రెడ్డి తో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో గా పరిచయం అయ్యి హీరో గా మొదటి సినిమానే హిట్ కొట్టాడు తేజ సజ్జ. ఈ సినిమా విడుదల అవకముందే రెండో సినిమాలో నటించాడు. మలయాళంలో రూపొందిన ఇష్క్ అనే సినిమాని తెలుగులో అదే టైటిల్ తో ‘ఇష్క్ – నాట్ ఎ లవ్ స్టోరీ’ అనే టైటిల్ తో రీమేక్ చేసారు. ఈ సినిమాలో తేజ కి జోడీ గా ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. ఏప్రిల్ లోనే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా సెకండ్ వేవ్ వలన ఆలస్యం అయ్యి ఈ వారంలో విడుదల అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది.
పేరు కి తగ్గట్టే ఈ సినిమా లవ్ స్టోరీ కాదు ఒక థ్రిల్లర్ అని తెలుస్తుంది. ట్రైలర్ ఆరంభం లో తేజ నాపేరు సిద్దు అంటూ పరిచయం చేసుకుని ఒక ఇంటికి వెళ్లడం చూపిస్తారు. కానీ అక్కడ ఏదో విషయం తెలుసుకోవడానికి తేజ వెళ్లినట్టు సీన్స్ చూపిస్తారు. అసలు హీరోయిన్ తో డేట్ సెట్ చేసుకుని తన బర్త్ డే సెలెబ్రేట్ చేయాలనీ ప్లాన్ చేసుకున్న హీరోకి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అసలు అవేంటి వాటి నుండి హీరో ఎలా బయటపడ్డాడు అనే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తుంది. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై పారస్ జైన్, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఎస్.ఎస్. రాజు అనే డైరెక్టర్ రూపొందించిన ఈ సినిమా ఆగష్టు 30 నుండి థియేటర్లలో విడుదల అవనుంది.