టాలీవుడ్: టాలీవుడ్ లో హను రాఘవపూడి సినిమాలు ప్రత్యేక శైలి లో ఉంటాయి. అయన సినిమాలు బాగా ఉన్నా ఎందుకో అంత కమర్షియల్ సక్సెస్ అవ్వవు. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’, ‘లై’ లాంటి సినిమాలు ఇవే కోవకు చెందుతాయి. ప్రస్తుతం మళయాళం హీరో దుల్కర్ సల్మాన్ హీరో గా ఒక డైరెక్ట్ తెలుగు మూవీ లో నటిస్తున్నాడు. ఆ సినిమాని హను డైరెక్ట్ చేయనున్నాడు. ‘యుద్ధం తో రాసిన ప్రేమ కథ’ లేదా ‘లెఫ్టనంట్ రామ్’ అనే టైటిల్ ని ఈ సినిమాకి వాడనున్నారు. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబందించిన చిన్న గ్లిమ్స్ వీడియో విడుదల చేసి ఆకట్టుకున్నారు. ఇవాళ ఈ సినిమాలో నటించే హీరోయిన్ కి సంబందించిన గ్లిమ్స్ విడుదల చేసారు.
ఈ మధ్యనే ఓటీటీ లో విడుదలైన ఫర్హాన్ అక్తర్ నటించిన ‘తూఫాన్’ సినిమాలో నటించిన ‘మృణాల్ థాకూర్’ ఈ సినిమాలో లెఫ్టనంట్ రామ్ కి జోడీ గా సీత పాత్రలో నటించనుంది. ఈ పాత్రకి సంబందించిన వీడియో కూడా విడుదల చేసారు. మణి రత్నం స్టైల్ లో మిర్రర్స్ లో హీరోయిన్ ని చూపించే షాట్స్ తో హీరోయిన్ మృణాల్ థాకూర్ ని పరిచయం చేసి బర్త్డే విషెస్ తెలియచేసారు సినిమా టీం. ఈ సినిమా ఒక పీరియాడిక్ కథ నేపథ్యం లో రూపొందుతుంది. మహానటి సినిమాని నిర్మించిన వైజయంతి మూవీస్ వారి ‘స్వప్న సినిమాస్’ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాతో సూపర్ హిట్ సాధించి హను రాఘవపూడి టాలెంట్ కి దగ్గ గుర్తింపు రావాలని ఆశిద్దాం.